: తెలంగాణ ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలంగాణలోని భద్రాద్రి ఆలయానికి వచ్చారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రమూర్తిని కొద్దిసేపటి క్రితం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన చినరాజప్పకు భద్రాద్రి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని తాను రామయ్యను కోరుకున్నట్లు దర్శనానంతరం ఆయన మీడియాకు చెప్పారు.