: మొత్తం ఆస్తిని రాధేమాకు రాసిచ్చేసి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబం... కొత్త కేసు నమోదు


తనకు తానుగా దేవతనని ప్రకటించుకుని, కురచ దుస్తులు ధరిస్తూ, వెకిలి డ్యాన్సులు చేస్తూ అపఖ్యాతిపాలైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాపై కొత్త కేసు నమోదైంది. గుజరాత్ లోని ఏడుగురు సభ్యుల కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకోవడానికి రాధేమా కారణమని రమేష్ జోషి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆమె మాటలను గుడ్డిగా నమ్మి తమ ఆస్తినంతటినీ వారు రాసిచ్చారని, జీవితంలో మార్పు రాకపోవడంతో, వారు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని జోషి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాధేమాపై ఇప్పటికే వరకట్న వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News