: ఏపీలో బంద్ ప్రారంభం... అంతా స్వచ్ఛందంగానే!


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ సీపీఐ ఇచ్చిన ఏపీ బంద్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, సీపీఎం, వైసీపీ తదితర పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు పలికాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలతో పాటు, వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని సినిమా థియేటర్లు బంద్ కు మద్దతుగా మార్నింగ్ షోను రద్దు చేశాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో నేటి ఉదయమే రోడ్లపైకి వచ్చిన సీపీఐ నేతలు తమకు కనిపించిన వాహనాలను అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలు దాటి బయటకు రాలేదు. బంద్ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.

  • Loading...

More Telugu News