: పాప్ సింగర్ లైవ్ కాన్సర్ట్ లో అపశ్రుతి
అమెరికన్ యువ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ లైవ్ కాన్సర్ట్ లో విషాదం చోటుచేసుకుంది. అమెరికాలోని సియాటెల్ లోని సెంచురీ లింక్ ఫీల్డ్ స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ జరుగుతుండగా, వారి డ్యాన్స్ బృందంలోని ఓ టీనేజ్ యువకుడు వంద అడుగులపై నుంచి కింద పడ్డాడు. దీంతో ఆహ్లాదకరంగా సాగుతున్న కాన్సర్ట్ లో విషాదం అలముకుంది. హుటాహుటీన యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన కాన్సర్ట్ నిర్వాహకులు వైద్యసేవలు అందించారు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడికి ఏం జరిగిందీ, ఎలా గాయపడిందీ మాత్రం గుర్తులేదని వైద్యులు చెప్పారు. కాగా, లైవ్ కాన్సర్ట్ విజయవంతమైందని పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ పేర్కొంది.