: బ్రిటన్ యువకుడు సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టివచ్చాడు!


ఇటీవల కాలంలో ప్రపంచ యాత్రలకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది కుటుంబసభ్యులతో కలసి ప్రపంచాన్ని చుట్టొస్తే, మరికొంతమంది ఒంటిరిగా వెళ్లొస్తుంటారు. కానీ బ్రిటన్ కు చెందిన టామ్ డేవీస్ అనే యువకుడు చిన్న వయసులోనే ప్రపంచాన్ని చుట్టేసి రికార్డు సృష్టించాడు. అది కూడా సైకిల్ పై! మొత్తం ఆరు నెలల పాటు 30వేల కిలో మీటర్లు ప్రయాణించి తన ప్రపంచ యాత్రను తాజాగా ముగించాడు. ఇంటిదగ్గర ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఏ రోజు తానెక్కడ వున్నది, ఏం చేస్తుంది, ఎలా వున్నది? వంటి అన్ని విషయాలను కుటుంబసభ్యులకు చెబుతూనే వచ్చాడట. ఆ విషయాలను టామ్ తన బ్లాగ్ లో తెలిపాడు. పర్యటనలో తనకు సమస్యలు ఎదురైనప్పటికీ సైకిల్ పై ప్రపంచాన్ని చుట్టి రావడం చాలా సంతోషంగా ఉందని టామ్ అంటున్నాడు. గంటకు 27 కిలో మీటర్ల వేగంతో సైకిల్ పై ప్రయాణించానని, ఎన్నో దేశాలు, వారి సంప్రదాయాలు తెలుసుకోవడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని బ్లాగ్ లో వెల్లడించాడు.

  • Loading...

More Telugu News