: ఢిల్లీలో జగన్ అరెస్టు... ఈ నెల 28న ఏపీ బంద్ కు పిలుపు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాది మంది కార్యకర్తలతో పార్టీ అధినేత జగన్ పార్లమెంటు ముట్టడికి బయల్దేరారు. దాంతో, పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా జగన్ రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు జగన్ ను అరెస్టు చేశారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 28న ఏపీ బంద్ కు జగన్ పిలుపునిచ్చారు.