: జరిగిందేదో జరిగింది... ఇక మీ నిరసనలు ఆపండి!: కాంగ్రెస్ కు ములాయం హెచ్చరిక


లోక్ సభలో కాంగ్రెస్ తీరుపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మండిపడ్డారు. సభ నుంచి హస్తం పార్టీ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ముగియడంతో ఈరోజు సభకు వచ్చారు. అయినప్పటికీ ఎంపీలు ప్లకార్డులతో తీవ్ర గందరగోళం సృష్టించారు. దాంతో కోపోద్రిక్తుడైన ములాయం కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేశారు. 'జరిగిందేదో జరిగింది. లోక్ సభలో మీ నిరసనలు చాల'ని సూచించారు. నిరసనలు ఆపకపోతే ఉన్న మద్దతు కూడా కోల్పోతారని హెచ్చరించారు. అంతకుముందు ములాయం సూచనతో స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్ష సభ్యులతో పార్లమెంట్ లో సమావేశమయ్యారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ విధించినప్పుడు సమాజ్ వాదీ పార్టీ దానిని ఖండించి, కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News