: అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం అనుమతి
దేశంలోని హిందువులందరికీ ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. రామజన్మభూమిగా భావించే అయోధ్యలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న వివాదాస్పద రామ్ లాలా ఆలయం మరమ్మతులకు కోర్టు అనుమతించింది. ఆలయ పైకప్పులు బాగుచేసుకోవచ్చని చెబుతూ, భక్తులకు ఇతర సౌకర్యాల కల్పనకు సైతం సుప్రీం అనుమతించింది. ఈ పనులు ఫైజాబాద్ కలెక్టర్, మరో ఇద్దరు స్వతంత్ర పర్యవేక్షకుల సమక్షంలో చేపట్టాలని ఆదేశించింది. కాగా, సుప్రీం తీర్పు పట్ల శివసేన తదితర పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.