: మీ భూమిని మీ ఇంటికి నేరుగా అందించాలన్నదే నా లక్ష్యం: చంద్రబాబు


విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 'నీ భూమి, నీ పట్టా' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పుడు మీ భూమిని మీ ఇంటికి నేరుగా అందించాలన్న లక్ష్యంతోనే మీ ఇంటికి మీ భూమి వెబ్ సైట్ ప్రారంభించామని చెప్పారు. వెబ్ సైట్ వల్ల భూ వివాదాల నివారణకు మంచి మార్గం దొరుకుతుందన్నారు. అధికారులు ఇంటికి వచ్చి భూముల వివరాలు సేకరిస్తారన్నారు. సర్వే నెంబర్ల ఆధారంగా భూముల వివరాలను కంప్యూటరీకరిస్తున్నామని, వాటితోపాటు పంటల వివరాలు కూడా వెబ్ సైట్ లో ఉంచుతామని సీఎం తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు ఆదాయ సర్టిఫికెట్ అవసరం లేదని, రేషన్ కార్డుతో స్కాలర్ షిప్ లు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రెవెన్యూ ఖాతాలతో ఆధార్ ను అనుసంధానం చేస్తున్నామన్నారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేటప్పుడు రీసర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ వల్ల ఒకే వ్యక్తి రెండు చోట్ల లాభం పొందే అవకాశం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News