: ప్రత్యేక హోదాపై తక్షణ చర్చకు తెలుగుదేశం నోటీసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించే అంశమై తక్షణం చర్చించాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో నోటీసు ఇచ్చారు. చర్చకు అంగీకరించకుంటే, నేటి లోక్ సభ సమావేశాల్లో ఆందోళన చేయాలని వారు భావిస్తున్నారు. తిరుపతిలో హోదా కోసం మునికామ కోటి ఆత్మహత్య చేసుకోవడం, ఇదే సమయంలో వైకాపా నేత జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేస్తుండడం... నేపథ్యంలో తెదేపా ఎంపీలు నోటీసులు ఇవ్వడం గమనార్హం. వీరి ఆందోళన ఎలా ఉంటుందో మరికాసేపట్లో తెలుస్తుంది.