: దక్షిణాఫ్రికా తరపున బరిలోకి దిగిన భారత క్రికెటర్ మన్ దీప్ సింగ్


ఫుడ్ పాయిజన్ కారణంగా, ఇండియాతో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా-ఏ జట్టులోని పది మంది ఆటగాళ్లు ఆసుపత్రి పాలుకావడంతో, ఆ జట్టు తరఫున ఫీల్డింగ్ చేసేందుకు సబ్‌ స్టిట్యూట్‌ లు అందుబాటులో లేక, వీడియో అనలిస్ట్ హెండ్రిక్స్ కొయిర్ట్‌ జెన్‌ ను ఫీల్డింగ్‌ కు దించిన సఫారీ జట్టు, ఆపై మరో ఫీల్డర్ కోసం భారత్-ఎ జట్టును అభ్యర్థించింది. దీంతో మన ఆటగాడు మన్‌ దీప్‌ సింగ్ దక్షిణాఫ్రికా జెర్సీ వేసుకుని వచ్చి ఆ జట్టు తరఫున కాసేపు ఫీల్డింగ్ చేశాడు. చెన్నైలో భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, తన కెరీర్ ఆరంభంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ పాకిస్థాన్ తరపున ఒసారి ఫీల్డింగ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

  • Loading...

More Telugu News