: 'గీత మా అమ్మాయి... కాదు మా అమ్మాయే'... పలు రాష్ట్రాల నుంచి వస్తున్న తల్లిదండ్రులు
దాదాపు 13 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతున్న మూగ, బధిర యువతి గీత తమ అమ్మాయంటే, తమ అమ్మాయేనంటూ పలువురు తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. గీత తమ అమ్మాయేనని పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి తల్లిదండ్రులు వచ్చారు. దీంతో తలపట్టుకున్న అధికారులు వీరిలో ఎవరు అసలు తల్లిదండ్రులన్న విషయాన్ని గుర్తించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయాన్ని కోరారు. అన్ని రికార్డులను, డీఎన్ఏ రిపోర్టులను సిద్ధం చేయాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి గీతను ఇండియాకు సురక్షితంగా తీసుకువస్తామని ఆమె ట్వీట్ చేశారు. కాగా, పాకిస్థాన్ లో ఉన్న గీత, తన తండ్రితో కలసి ఓసారి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లానని తన సైగల ద్వారా చెబుతోంది.