: మోదీ అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు


రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడక తప్పదన్న అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తించారు. ఈ అంశంపై ప్రజల్లో అసంతృప్తి క్రమంగా రాజుకుంటోందన్న సమాచారం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. దాంతో, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో తమకు సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి ప్రత్యేక హోదాపై మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News