: ఇప్పటి పేసర్లందరిలో ఇషాంత్ శర్మే అథముడు: నెహ్రా


సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా భారత పేసర్లపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. టాలెంట్ పరంగా చూస్తే ఇప్పటి పేసర్లందరిలోకీ ఇషాంత్ శర్మే అథముడని అన్నాడు. అయితే, ఇషాంత్ చాలా కష్టపడతాడని చెప్పాడు. "ఇప్పుడున్న ఫాస్ట్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ను ఇష్టపడతాను. ప్రతిభ పరంగా చూస్తే అతను ఇప్పటికే ఎంతో సాధించి ఉండాల్సింది, కానీ, నాలాగా అతడూ సమస్యల బారిన పడి ఉంటాడు. నా మటుకు గాయాలు ప్రతిబంధకంగా మారాయి. ఇక, వరుణ్ ఆరోన్, భువనేశ్వర్ కుమార్ కూడా నైపుణ్యం ఉన్న బౌలర్లే. వీళ్లందరిలోకీ టాలెంట్ తక్కువగా ఉన్న ఆటగాడు ఇషాంతే. అయితే, శ్రమించే తత్వం మెండుగా ఉన్న ఆటగాళ్లలో అతనొకడు" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News