: విషమంగా రాష్ట్రపతి సతీమణి ఆరోగ్యం... ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్ర ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి అధికారులు తెలిపారు. "శ్వాసక్రియకు సంబంధించిన సమస్యతో రాష్ట్రపతి భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె హార్ట్ పేషెంట్. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం" అని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న (శుక్రవారం) సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఒడిశా పర్యటనలో ఉన్న ప్రణబ్ విషయం తెలిసి వెంటనే ఢిల్లీ తిరుగుపయనమై వచ్చారు.