: యాకుబ్ అంత్యక్రియల్లో పాల్గొనాలని మద్దతుదారులకు దావూద్, చోటా షకీల్ ఫోన్!
యాకూబ్ మెమన్ ను ఉరితీసిన తరువాత పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. ఉరితీసిన తరువాత అతని మృతదేహాన్ని ముంబయికి తరలించారు. విమానాశ్రయం నుంచి ఎలాంటి అంతిమయాత్ర లేకుండా సోదరుని ఇంటికి తీసుకువెళ్లిన తరువాత మెరైన్ లైన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సమయంలో అంత్యక్రియలకు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించాలంటూ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లు ముంబయిలోని తమ మద్దతుదారులకు ఫోన్ చేసి చెప్పారట. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రచురించిన ఓ కథనంలో వెల్లడించింది. అందుకే ఆ రోజు అంత్యక్రియలకు 10వేల మంది భారీ ఎత్తున వచ్చారట. ఈ కారణంగానే 30వేలకు పైగా ముంబయి పోలీసులు భారీ భద్రత చేపట్టినట్టు తెలుస్తోంది.