: చంద్రబాబు, కోడెలకు జగన్ బహిరంగ లేఖ...కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మారుస్తున్నారని ఆరోపణ
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ లకు ఘాటు లేఖ రాశారు. కుటిల రాజకీయ వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మారుస్తున్నారని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసస్ సమావేశాన్ని ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైెఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం తొలగింపుపై చర్చించేందుకు ఉద్దేశించిన ఆ కమిటీలో 25 మంది సభ్యులను నియమించిన స్పీకర్, తమ పార్టీకి చెందిన ముగ్గురికే చోటు కల్పించారని ధ్వజమెత్తారు. అంతేకాక తాము ఢిల్లీలో దీక్ష చేస్తున్న రోజే సమావేశాన్ని ఏర్పాటు చేయడమేమిటని కూడా ఆయన ప్రశ్నించారు.