: ఏపీకి ప్రత్యేక హోదాపై నేడు కాంగ్రెస్ పోరు సభ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పోరాటం మొదలుపెట్టబోతోంది. ఈ మేరకు తిరుపతిలో ఈరోజు ఆ పార్టీ భారీ పోరు సభ నిర్వహించనుంది. ఈ సభలో చిరంజీవి, సి.రామచంద్రయ్య, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సహా పలువురు నేతలు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల అసలు స్వరూపాన్ని బహిర్గతం చేస్తామన్నారు. రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.