: రాజేశ్ ఖన్నా భార్య, సినీ నటి డింపుల్ కపాడియాకు కోర్టు నోటీసు


ప్రముఖ నటుడు, దివంగత రాజేశ్ ఖన్నా భార్య, ప్రముఖ నటి డింపుల్ కపాడియాకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఖన్నా మరణించిన తరువాత డింపుల్, ఆమె అల్లుడు అక్షయ్ కుమార్, కుమార్తె ట్వింకిల్ ఖన్నాలు తనను గృహ హింసకు గురి చేస్తున్నారంటూ ఖన్నాతో సహజీవనం చేసిన అనితా అద్వానీ బాంబే హైకోర్టుకు వెళ్లారు. ఆమె పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా అనిత మళ్లీ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి తన ఫిర్యాదును పునరుద్ధరించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం డింపుల్ కు నోటీసు ఇచ్చింది. కాగా విచారణ సమయంలో, రాజేశ్ ఖన్నా నుంచి కపాడియా విడిపోయాక తన క్లయింట్ అనిత 25 ఏళ్ల పాటు నివసించారని ఆమె తరపు న్యాయవాది సీఏ సుందరమ్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సహజీవనాన్ని ఆమోదించిన సుప్రీం ఈ కేసులో ఎలాంటి తీర్పు చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News