: చరిత్రలో నిలిచిపోయేలా పాదయాత్ర ముగింపు సభ: టీడీపీ


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఆరున్నర నెలలుగా, అవిశ్రాంతంగా సాగిస్తోన్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖలో జరిగే భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో ఈనెల 27న బాబు తన పాదయాత్రను ముగించనున్నారు. ఆరోజు బాబు విశాఖలో ఓ భారీ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాదయాత్రగా సభావేదిక వద్దకు చేరుకుంటారు. కాగా, సభ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తోన్న తుమ్మల నేడు జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News