: 'తుగ్లక్' ఎడిటర్ చో రామస్వామిని పరామర్శించిన మోదీ
ఈ రోజు చెన్నైలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళ వారపత్రిక 'తుగ్లక్' ఎడిటర్ సీహెచ్ వో (చో) రామస్వామిని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి రామస్వామితో ప్రధాని మాట్లాడారు. 80 ఏళ్ల రామస్వామి కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కలసిన ప్రధాని ఆరోగ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామస్వామి సినీ హాస్యనటుడు, రాజకీయవేత్త కూడా!