: చెరువులో పడ్డ ఆర్టీసీ బస్సు... 50 మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లాలో కొద్దిసేపటి క్రిత ఘోర ప్రమాదం జరిగింది. నిండా వంద మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాలపాలైన 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై వెనువెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని సోంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. గాయాలతో విషమ పరిస్థితికి చేరుకున్న ఐదుగురిని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.