: జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90 కోట్లు: టీటీడీ ఈవో


తిరుమల శ్రీవారికి సంబంధించిన ఆదాయం, దర్శనం, లడ్డూల వివరాలను టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్ లైన్ లో ఆర్జిత సేవల బుకింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో నేటి నుంచి 25వేల ఆర్జిత సేవా టికెట్లు ఉంచుతున్నట్టు చెప్పారు. అయితే గత 45 రోజుల నుంచి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం నిలిచిపోయిందన్నారు. ఇక జులై నెలలో హుండీ ఆదాయం రూ.90 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది జులైలో 10వేల మంది అదనంగా దర్శనం చేసుకున్నారన్నారు. బంగారం పథకం కింద 4.5 టన్నులు డిపాజిట్ చేశామని, మరో టన్ను బంగారం డిపాజిట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన డీమ్యాట్ ఖాతా ద్వారా 28 మంది భక్తులు షేర్లు బదిలీ చేశారని సాంబశివరావు వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ 4 లడ్డూలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

  • Loading...

More Telugu News