: సస్పెన్షన్ ఎత్తి వేస్తాం... సస్పెండైన సభ్యులు సభలోకి రావొచ్చు: వెంకయ్యనాయుడు
లోక్ సభలో సస్పెన్షన్ కు గురైన 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సస్పెన్షన్ ఎత్తి వేస్తామని, సస్పెండైన సభ్యులు సభలోకి రావొచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు లోక్ సభలో ప్రకటించారు. అంతకుముందు, సస్పెండైన సభ్యులు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలవాలని చెప్పారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతలంతా సస్పెన్షన్ కు నిరసనగా ఆందోళన చేస్తున్నారు.