: మానసిక రుగ్మతపై బాలీవుడ్ భామ పోరు!


బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే డిప్రెషన్ పై పోరు ప్రకటించింది. గతంలో మానసిక రుగ్మతతో తీవ్ర ఇబ్బందులు పడ్డ దీపిక, ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర నటిగా కొనసాగుతోంది. డిప్రెషన్ ను జయించిన దీపికాకు సదరు రుగ్మత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న విషయంపై పూర్తి అవగాహన ఉంది. ఈ అవగాహనతోనే డిప్రెషన్ కు గురైన వారికి బాసటగా నిలవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ది లైవ్ లవ్ లాఫ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా నిన్న విస్పష్ట ప్రకటన చేసింది. ‘ఫౌండేషన్ అగైనెస్ట్ డిప్రెషన్’ నినాదంతో అరంగేట్రం చేసిన ఈ సంస్థ... దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలు, అవగాహన దిశగా పనిచేస్తుందని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News