: బాహుబలి సందడి పూర్తి కాకుండానే శ్రీమంతుడు ఘనవిజయం అద్భుతం: ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ
నేడు విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం అద్భుత విజయం సాధించిందని దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. చిత్రంలో మహేష్ నటన అద్భుతమని, బాహుబలి సందడి పూర్తి కాకుండానే, ఆ చిత్రం విజయం ప్రభావం ఎంతమాత్రమూ లేకుండా మరో గొప్ప విజయం సాధించిన సినిమా 'శ్రీమంతుడు' రూపంలో వచ్చిందని ఆయన అన్నారు. గొప్ప గ్రాఫిక్స్ దృశ్యాలు లేకపోయినా, గుండెలకు హత్తుకునేలా చిత్రం అందరినీ అలరిస్తుందని అభిప్రాయపడ్డారు. వందల కోట్లు ఖర్చు, సంవత్సరాల తరబడి శ్రమ లేకుండా, సాధారణ కథాంశం, అందమైన చిత్రీకరణ, మహేష్ అందం చిత్రాన్ని ఘన విజయం దిశగా పంపుతాయని అన్నారు.