: అమెరికాలో లాబీయింగ్ కు కోట్లు ఖర్చు పెడుతోన్న భారత్


ఏ దేశమైనా తన పనులు చక్కబెట్టుకునేందుకు మరో దేశంలో లాబీయింగ్ కు పాల్పడడం సహజమే. పెట్టుబడులు సాధించుకునేందుకు, సెనేట్ నుంచి అనుకూల నిర్ణయాలు రాబట్టేందుకు.. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ అగ్రరాజ్యం అమెరికా సెనేటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యవహారాలు నడుపుతాయి. వ్యవహారం అన్నాక కాస్త ఖరీదైన విషయమే. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2013లో తొలి త్రైమాసికం నాటికి మనదేశం అమెరికాలో నెరిపిన లాబీయింగ్ కు అయిన ఖర్చు అక్షరాలా కోటి రూపాయలట.

'బార్బర్ గ్రిఫిత్ అండ్ రోజర్స్'సంస్థ భారత్ తరుపున 2005 నుంచి అమెరికాలో లాబీయింగ్ చేస్తోంది. అందుకు ఇప్పటి వరకు అయిన వ్యయం రూ. 25 కోట్లు. కాగా, అమెరికాలో లాబీయింగ్ న్యాయబద్ధమే. అయితే, ఆయా లాబీయింగ్ సంస్థలు తమ క్లయింట్లకు సంబంధించిన నివేదికలను సెనేట్ కు విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వమే కాకుండా.. ఓఎన్జీసీ విధేశ్, నాస్కామ్, స్టెర్లింగ్ బయోటెక్ వంటి కంపెనీలు కూడా అమెరికాలో లాబీయింగ్ జరిపాయి.

  • Loading...

More Telugu News