: టీమిండియాతో రెగ్యులర్ గా ఆడితే నేర్చుకోవచ్చు: పాక్ జట్టుకు ఇంజమమ్ సూచన


పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చాన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చాడు. పాకిస్థాన్ క్రికెటర్లు ఒత్తిడిలోనూ ఎలా రాణించాలో నేర్చుకోవాలంటే టీమిండియాతో రెగ్యులర్ గా ఆడాలని సూచించాడు. బాగా రాటుదేలాలంటే జాతీయ జట్టును భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనలకు వీలైనంత ఎక్కువగా పంపిస్తుండాలని పీసీబీకి తెలిపాడు. "గతంలో మేం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించినప్పుడు కష్టాల పాలయ్యాం. అదే సమయంలో, ఒత్తిడి వేళ ఎలా ఆడాలో కొంత నేర్చుకున్నాం. ఇప్పుడు భారత జట్టుతో రెగ్యులర్ గా ఆడడం ద్వారా ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకోవచ్చు. పాక్ ఆటగాళ్లకు ఇంతకంటే మంచి మార్గం ఉంటుందనుకోను. అయితే, ఎక్కడ ఆడామన్నది ముఖ్యం కాదు, భారత్ తో క్రమం తప్పకుండా ఆడుతుండాలి. ఈ దిశగా పీసీబీ మరిన్ని టూర్లు ఏర్పాటు చేయాలి" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News