: ఏపీలో భారీగా అంగన్ వాడీ సిబ్బంది జీతాల పెంపు
ఏపీలో కొన్నాళ్లుగా జీతాల పెంపుకోసం డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు మూడు కేటగిరీలుగా ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు భారీగా పెంచాలని ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఈరోజు జరిగిన సమావేశంలో వేతనాలు పెంపుకు ఆమోదం తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్తలకు 4,200 నుంచి రూ.7,100, అంగన్ వాడీ సహాయకులకు రూ.2,200 నుంచి రూ.4,600, మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ.2,950 నుంచి రూ.4,600కు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీతాలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.