: మరుగుదొడ్డి ఉంటేనే పోటీకి అర్హత... బీహార్ పంచాయతీ ఎన్నికల్లో కొత్త నిబంధన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి షాకిచ్చేందుకు బీహార్ లోని అన్ని పార్టీలు దాదాపుగా ఏకతాటిపైకి వచ్చేసినట్లే. అయితే ఆ రాష్ట్రంలో మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కు మంచి స్పందనే లభిస్తోంది. ప్రజల నుంచే కాదండోయ్, ప్రభుత్వం నుంచి కూడా! అసలు విషయమేంటంటే, స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లకు కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్న బీహార్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, ఏకంగా ఓ వినూత్న చట్టాన్నే తీసుకొచ్చింది. ఇకపై ఆ రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి తన ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి కలిగి ఉండాల్సిందేనట. ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్డి లేని వ్యక్తులకు అసలు ఆ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదట. ఈ మేరకు నిన్న బీహార్ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి కీలక సవరణ చేసింది.