: అభిమాని ప్రశ్నకు గడుసుగా సమాధానమిచ్చిన అలియా భట్


బాలీవుడ్ యువనటి అలియా భట్ 'మేధో'సంపత్తిపై లెక్కలేనన్ని జోకులున్నాయి. ఆ జోకుల బాధ తట్టుకోలేక ఓ వీడియో కూడా విడుదల చేసిందీ అమ్మడు. అలాంటి అలియా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు గడుసుగా సమాధామిచ్చి ఆకట్టుకుంది. షాహిద్ కపూర్ తో జంటగా నటిస్తున్న 'షాందార్' సినిమా పోస్టర్ విడుదల సందర్భంగా అభిమానులతో సోషల్ మీడియాలో చర్చించింది. ఈ సందర్భంగా షాందార్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందా? అని ఒక అభిమాని ప్రశ్నించాడు. 'వంద కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో చెప్పలేను కానీ, వంద కోట్ల మంది హృదయాలు గెలుచుకుంటుంది' అని అలియా సమాధానమిచ్చింది. కాగా, స్కూల్ లో చదువుతున్న రోజుల్లో సినిమాలు చూస్తూ షాహిద్ తో ప్రేమలో పడ్డానని అలియా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ జంట నటించిన షాందార్ సినిమా పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News