: ఇస్తాంబుల్ నుంచి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష


ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలసి టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి ఈ రోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై చర్చించారు. అంతేగాక మంచినీటి సమస్యపై అడిగి తెలుసుకున్న సీఎం, పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పని కల్పించాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News