: బాలుడు రోడ్డెక్కాడని...తల్లిని లోపలేశారు
బాలుడు ఒంటరిగా రోడ్డుపై తిరుగాడుతూ కనిపించాడన్న ఆరోపణపై అతని తల్లిని ఇంగ్లండ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మాంచెస్టర్ లోని ఓ వీధిలో రెండేళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతూ స్థానికులకు కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ బాలుడ్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ ప్రతి ఇంటికీ వెళ్లి బాలుడు మీ వాడేనా? అంటూ ఆరాతీశారు. ఎంతకీ ఆచూకీ తేలకపోవడంతో బాలుడి ఫోటో అధికారిక ఫేస్ బుక్ లో పెట్టారు. ఫేస్ బుక్ లో పెట్టిన గంటకే బాలుడి తల్లి వివరాలు లభ్యమయ్యాయి. దీంతో బాలుడిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు బ్రిటన్ పోలీసులు.