: మీ పీతల కూర అద్భుతం!: శ్రీలంక క్రికెటర్ల రెస్టారెంట్ కి కోహ్లీ కితాబు
శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ కు అనుకోని అతిథి వచ్చాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ రెస్టారెంట్లో పీతల కూరతో భోజనం చేశాడు. తృప్తిగా భోజనం చేసిన కోహ్లీ పీతల కూర అద్భుతమని కొనియాడాడు. ఇంత రుచికరమైన భోజనం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని అన్నాడు. భోజనం ముగిసిన తరువాత రెస్టారెంట్ లో దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు. కాగా, శ్రీలంక రాజధాని కొలంబోలో జయవర్ధనే, సంగక్కర ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో పీతల కూర స్పెషల్. శ్రీలంకలో దొరికే ప్రత్యేకమైన పీతలను ఈ రెస్టారెంట్ లో విందుగా అందిస్తారు. ఈ పీతల స్పెషల్స్ కు శ్రీలంకలో మంచి ఆదరణ ఉండగా జయవర్ధనే, సంగక్కర హోటల్ కావడంతో దానికి విశేషమైన ఆదరణ ఉంది.