: ప్రత్యేకహోదాపై ప్రత్యక్షపోరాటం చేయం: సుజనా చౌదరి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ప్రత్యక్షపోరాటం చేయడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని అన్నారు. ఆ సిద్ధాంతాల ప్రకారమే నడచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యక్ష పోరాటం కంటే చర్చల ద్వారా హామీల అమలుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. కేసులు మాఫీ చేయించుకునేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటును కాంగ్రెస్ అడ్డుకోవడం వల్లే పలు అంశాలపై చర్చించలేకపోయామని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా వస్తుందంటే రాజీనామా చేస్తామన్న ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సుజనా స్పష్టం చేశారు.