: ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న బీఎస్ఎఫ్... ముగ్గురు బందీలు క్షేమం


ఈ ఉదయం జమ్మూకాశ్మీర్ లోని ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఇదే సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. అనంతరం, మగ్గురు స్థానిక పౌరులను తన అధీనంలోకి తీసుకున్న మరో టెర్రరిస్టు సమీపంలో ఉన్న అడవిలోకి పారిపోయాడు. ఆ తర్వాత, టెర్రరిస్టును అంతమొందించేందుకు అడవిలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లు ఆ ముష్కరుడిని ఏకంగా ప్రాణాలతోనే పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో బీఎస్ఎఫ్ జవాన్లకు స్థానికులు కూడా సాయం చేశారు.

  • Loading...

More Telugu News