: టీ ఇండస్ట్రియల్ పాలసీ భేష్... ఇలాంటి పాలసీని ఇప్పటిదాకా చూడలేదన్న రతన్ టాటా


కొత్త రాష్ట్రం తెలంగాణ సరికొత్తగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం (టీ ఇండస్ట్రియల్ పాలసీ)పై భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ప్రశంసల జల్లు కురిపించారు. కొద్దిసేపటి క్రితం ఆయనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. టీ హబ్ ప్రారంభోత్సవానికి రావాలని టాటాను కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఆకాశానికెత్తేశారు. ఏళ్లుగా పారిశ్రామికవేత్తగా ఉన్న తాను టీ ఇండస్ట్రియల్ పాలసీ లాంటి పారిశ్రామిక విధానాన్ని ఇప్పటిదాకా చూడలేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News