: హైకోర్టు విభజనపై ఎంపీ కవిత వ్యాఖ్యలతో విభేదిస్తున్నా: సదానందగౌడ
హైకోర్టు విభజనపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనపై న్యాయశాఖ మంత్రి సదానందగౌడ స్పందించారు. ఏపీ సూచించిన చోట హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కోర్టుకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన ఎంపీ కవిత, హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. వెంటనే ఖండించిన సదానంద, ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానన్నారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధలో ఉందని, కోర్టులో ఉన్న అంశంపై తాను మాట్లాడలేనని చెప్పారు. అంతకుముందు లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి సదానందగౌడ చెప్పిన వాటిలో కొత్త అంశాలు లేవన్నారు. ఏపీకి హైకోర్టు స్థలం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.