: హన్మకొండలో దీక్ష చేపట్టిన ఎర్రబెల్లి


టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేతలు దాడిని పెంచారు. ప్రభుత్వ పాలనను నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ ఉదయం దీక్ష చేపట్టారు. వరంగల్ జిల్లా హన్మకొండలో చేపట్టిన దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్దతు పలికారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎర్రబెల్లి ఈ దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

  • Loading...

More Telugu News