: డ్రంకన్ డ్రైవ్ లో మాజీ ఎమ్మెల్యే పట్టివేత!


హైదరాబాదు నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటిదాకా యువకులే డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడుతుండగా, ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో యువతులు కూడా పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నగర పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మాజీ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు. మద్యం మత్తులో మాజీ ఎమ్మెల్యే పట్టుబడటంతో షాక్ తిన్న పోలీసులు ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురయ్యారట. తీరా సదరు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థనతో పోలీసులు ఆయనను వదిలేశారట. ఇక ఆయన పేరును వెల్లడించేందుకు కూడా పోలీసులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News