: ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్
హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది. తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రొ కబడ్డీ లీగ్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసడార్ గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేశారు. అటు, నటులు అలీ, అల్లు శిరీష్, శ్రీకాంత్, లావణ్య త్రిపాఠి తదితరులు కూడా మ్యాచ్ కు హాజరయ్యారు.