: క్రీడాకారిణినే... అయితే, ముందుగా ఆడపిల్లని!: సానియా మీర్జా
క్రీడాకారిణినే అయినప్పటికీ అంతకంటే ముందు తాను ఆడపిల్లనని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఐఐజేడబ్ల్యూ ఫ్యాషన్ వీక్ లో సంప్రదాయ నగల్లో సందడి చేసిన అనంతరం సానియా మాట్లాడుతూ, క్రీడాకారిణి అయినంతమాత్రాన నగలు, దుస్తులపై ఇష్టం ఉండదని అనుకోవద్దని తెలిపింది. అందరమ్మాయిల్లాగే నగలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ఫ్యాషన్ షోను ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపింది. ర్యాంప్ వాక్ తనకు కొత్త కాదని, గతంలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్, ఇండియన్ బ్రైడల్ వీక్, గ్లోబల్ ఫ్యాషన్ షోల్లో ర్యాంప్ వాక్ చేశానని సానియా మీర్జా తెలిపింది.