: కొత్త స్పోర్ట్స్ బైక్ సీబీఆర్ 650ఎఫ్ ను లాంచ్ చేసిన హోండా... ధర రూ.7.3 లక్షలు!


జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత విభాగం హెచ్ఎమ్ఎస్ఐ (హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా) కొత్తగా సీబీఆర్ 650ఎఫ్ పేరుతో ఓ స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.3 లక్షలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర). దీనిపై హెచ్ఎమ్ఎస్ఐ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కీతా మురమత్సు మాట్లాడుతూ... ఈ ఏడాది దేశంలో 15 మోడళ్లు ప్రవేశపెడతామని ప్రకటించామని, ఈ క్రమంలో గడచిన 7 నెలల్లో 10 కొత్త బైకులు తీసుకువచ్చామని, ఆ పరంపరలో సీబీఆర్ 650ఎఫ్ 11వ మోడల్ అని తెలిపారు. మోనో సస్పెన్షన్, 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్, ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ దీని ప్రత్యేకతలు. ఢిల్లీలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో, హోండా బ్రాండ్ అంబాసడార్ అక్షయ్ కుమార్, నటి తాప్సీ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News