: పోర్న్ సైట్ల నిషేధం స్వేచ్ఛకు వ్యతిరేకం: కేంద్రంపై చేతన్ భగత్ విసుర్లు
పోర్న్ సైట్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరును చాలామంది విమర్శిస్తున్నారు. దేశంలో అశ్లీల సైట్లను నిషేధించడం సరికాదని, అది వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకమని సుప్రసిద్ధ రచయిత చేతన్ భగత్ ఎలుగెత్తారు. అది రాజకీయపరంగా ఏమంత మంచి నిర్ణయం అనిపించుకోదని హితవు పలికారు. ప్రజల వ్యక్తిగత జీవితాలను నియంత్రించరాదని ట్విట్టర్లో తెలిపారు. "నిషేధించాల్సింది పోర్న్ సైట్లను కాదు... మగవాళ్ల దొంగచూపులను నిషేధించండి, వేధింపులను నిషేధించండి" అని పేర్కొన్నారు.