: 15 వరకే చాన్స్! ఏపీలో ఉద్యోగ బదిలీలకు పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ నెల 15వ తేదీ అర్థరాత్రి వరకూ బదిలీలు చేసుకునేందుకు అన్ని శాఖలకూ అనుమతిస్తూ, జీవో నంబర్ 98ని మంగళవారం ఆర్థిక శాఖ జారీచేసింది. తిరిగి 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం ఉంటుందని ఆ శాఖ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ వివరించారు. అయితే, రాష్ట్ర ఖజానా ఆదాయ లెక్కలు చూసే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర శాఖల్లో బదిలీలు ఉండవని స్పష్టం చేశారు.