: సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ర్పవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఈ అంశంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీని నెరవేర్చడానికి సీఎం ఎటువంటి ప్రయత్నం చేయలేదని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఖైదీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో వివరించారు. ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలయ్యాక రేవంత్ అనూహ్యంగా సీఎంకు లేఖ రాయడం గమనార్హం.

  • Loading...

More Telugu News