: ఫుట్ బాల్ మ్యాచ్ పై కాల్పులు... ఐదుగురు క్రీడాకారుల మృతి


ఎల్‌ సాల్వెడార్ లో ఘోరం జరిగింది. సాన్‌ నగరానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుంటే కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన పలువురు ఫుట్ బాల్ అభిమానులకు గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రెండు ముఠాల మధ్య నెలకొన్న భూ వివాదాల కారణంగా కాల్పులు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు.

  • Loading...

More Telugu News