: అప్పుడు అందమైన స్త్రీలు కూడా ఢిల్లీలో అర్ధరాత్రి వేళ తిరగొచ్చు!: దుమారం రేపుతున్న ఆప్ మాజీ మంత్రి వ్యాఖ్యలు
ఢిల్లీ అధికార పగ్గాలు చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నిర్ణయాలు తీసుకున్న ఆప్ కు చెందిన ఓ నేత నిన్న ఢిల్లీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేజ్రీవాల్ కేబినెట్ లో పనిచేసిన మాజీ న్యాయ శాఖ మంత్రి సోమ్ నాథ్ భారతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీలో పోలీసు వ్యవస్థపై తమ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇస్తే, అందమైన మహిళలు సైతం అర్ధరాత్రి బయట తిరిగేంత భద్రతను ఇవ్వగలం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సోమ్ నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.