: థానేలో కుప్పకూలిన భవనం... 11 మంది మృతి, శిథిలాల కింద మరికొంత మంది


మహారాష్ట్రలోని థానేలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర ప్రమాదం సంభవించింది. రాత్రి 2 గంటల సమయంలో మూడంతస్తుల నివాస భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 11 మంది చనిపోయారు. భవనం శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం శిథిలావస్థకు చేరుకుందని స్థానిక మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినా, అక్కడి జనం పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News