: ప్రొ కబడ్డీ హైదరాబాద్ కు వచ్చేసింది... గచ్చిబౌలిలో సందడి చేయనున్న బన్నీ
ప్రేక్షకాదరణలో క్రికెట్ కు గట్టి పోటీగా ఎదుగుతున్న ప్రొ కబడ్డీ ఫీవర్ భాగ్యనగరి హైదరాబాదుకు వచ్చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ లో నేటి నుంచి కబడ్డీ మ్యాచ్ లు హైదరాబాదులో సందడి చేయనున్నాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నేటి నుంచి ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక తెలుగు టైటాన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ గీతాన్ని ఆలపించి ఈ మ్యాచ్ లను ప్రారంభించనున్నాడు. తొలి మ్యాచ్ లో భాగంగా తెలుగు టైటాన్స్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ తో తలపడనుంది.